News March 19, 2024
లోక్‌సభ ఎన్నికలపై ఎమ్మెల్యేల సమావేశం

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. పార్టీ ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో సమావేశమయ్యారు. ZHB పరిధిలోని ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వ్యూహం, పార్టీలో చేరికలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో సురేష్ శెట్కార్, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ తదితరులు ఉన్నారు.
Similar News
News October 17, 2025
NZB: 102 వైన్స్‌లకు దరఖాస్తులు ఎన్నంటే?

NZB జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు సంబంధించి గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్లకు 234 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాప్‌లకు 168, ARMR- 25 షాప్‌లకు 135, భీంగల్-12 వైన్ షాపులకు 65, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపులకు 85 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.
News October 17, 2025
NZB: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

అక్టోబర్ 21 న పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆసక్తి గల విద్యార్థులు, యువత, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఎవరైనా సరే పోలీస్ సేవలు, త్యాగాలు, సమాజ రక్షణపై ఆధారంగా 3 ఫోటోలు లేదా 3 నిమిషాల షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కమీషనర్ సాయి చైతన్య ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24లోపు కమీషనరేటు పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పీఆర్వోకు అందజేయాలని తెలిపారు.
News October 16, 2025
సీపీఆర్‌తో ప్రాణాలను రక్షించవచ్చు: కలెక్టర్

గుండెపోటుకు గురైన వారికి సకాలంలో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీససిటేషన్) చేసి ప్రాణాలను రక్షించవచ్చని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అకస్మాత్తుగా వచ్చే గుండెపోటుకు సీపీఆర్ ఎంతో ఉపయోగమన్నారు. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.