News May 10, 2024
లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై పటిష్టమైన ఏర్పాట్లు చేశాం: సీపీ

శాంతియుత వాతావరణంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ఎన్ఫోర్స్మెంట్.. తదితర ఎన్నికల విధులపై సిబ్బందికి పోలీస్ కమిషనర్ దిశా నిర్దేశం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండటంతో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధి విధానాలపై సూచనలు చేశారు.
Similar News
News February 16, 2025
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పినపాక మండలం దుగినేపల్లి గ్రామం చెగర్శల సరిహద్దు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు గుంతను తప్పించబోయి కిందపడ్డారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాటూరి హనుమంతరావు, మునిగెల నాగేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. మృతులు ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అల్లుళ్లుగా సమాచారం.
News February 16, 2025
బోనకల్: గుండెపోటుతో నిద్రలోనే యువకుడు కన్నుమూత

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బోనకల్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. కలకోటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి తోకచిచ్చు నిహార్ రాత్రి అన్నం తిని పడుకున్నాడు. ఉదయం లేచేసరికి వాంతి చేసుకున్నట్లు ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నిహార్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంటికి పెద్ద కుమారుడు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
News February 16, 2025
పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలి: భట్టి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పథకాలను లఘుచిత్రాల ద్వారా ప్రచారం చేయాలని… వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. డిజిటల్ భూసర్వేకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని అన్నారు.