News September 8, 2024

లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడండి: ఎస్పీ

image

ఈనెల 14వ తేదీ కోర్టులలో జాతీయ మెగా లోక్ అదాలత్ జరుగుతుందని, కక్షిదారులు త్వరితగతిన కేసులు పరిష్కారం కొరకు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సత్యసాయి ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, ఎస్సై, కోర్టు కానిస్టేబుల్స్‌తో ఎస్పీ జామ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు.

Similar News

News October 15, 2024

కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన సత్యసాయి జిల్లా జేసీ

image

శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పరిశీలించారు. అల్పపీడన పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం తెలపాలని కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 15, 2024

అనంతపురం జిల్లా ప్రజలకు APSDMA హెచ్చరికలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్ష సూచనతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తోంది. జిల్లా ప్రజల ఫోన్లకు APSDMA అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. మరోవైపు జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

News October 15, 2024

అనంత, సత్యసాయి జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్‌లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా బాధ్యతలు అప్పగించింది. అనంతపురం జిల్లాకు టీజీ భరత్, శ్రీ సత్యసాయి జిల్లాకు అనగాని సత్యప్రసాద్ ఇన్‌ఛార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును వీరు పర్యవేక్షిస్తారు.