News July 29, 2024

లోక్ సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్ సభలో అరుదైన గౌరవం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న BJPకి లోక్ సభలో విప్‌గా బాధ్యత నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్ సభ స్పీకర్‌కు పార్టీ తరుఫున చీఫ్ విప్, విప్‌లుగా నియమించిన వారి పేర్లను తెలియజేశారు. రాష్ట్రం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎంపిక కావడం పట్ల కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 24, 2025

HYD: సర్కార్ దవాఖానాలకు ‘మందుల’ సుస్తి

image

నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అత్యవసర మందుల కోసం అవస్థలు పడుతున్నాయి. పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులు అత్యవసర రోగులకు మందులు అందించలేక పోతున్నాయి. నిధుల కొరతతో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది.  దాదాపు రూ.300 కోట్ల నిధులు జాప్యంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు.

News November 24, 2025

సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

image

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.

News November 24, 2025

సింగూరు డ్యామ్‌లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

image

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.