News June 27, 2024
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన టీడీపీ ఎంపీలు
పార్లమెంట్లో గురువారం టీడీపీ ఎంపీలందరూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి వినతి పత్రం అందించారు. పార్లమెంట్ భవన్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో టీడీపీకి కేటాయించిన కార్యాలయం చిన్నదిగా ఉండటంతో కొంచెం విశాలమైన స్థలం ఉన్న కార్యాలయం కేటాయించాలని కోరారు. టీడీపీ పార్లమెంట్ పక్షనేత లావు కృష్ణదేవరాయ ఆధ్వర్యంలో టీడీపీ ఎంపీలందరూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 13, 2024
కృష్ణా: వాయిదా పడ్డ డిగ్రీ పరీక్షలు.. రివైజ్డ్ టైం టేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో డిసెంబర్ 2024లో జరగాల్సిన డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షలు వాయిదా పడినట్లు యూనివర్శిటీ యాజమాన్యం గురువారం తెలిపింది. ఈ పరీక్షలను 2025 జనవరి 21 నుంచి ఫిబ్రవరి 14 మధ్య నిర్ణీత తేదీలలో నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. రివైజ్డ్ టైం టేబుల్‌కు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని యూనివర్శిటీ తాజాగా ఒక ప్రకటనలో సూచించింది.
News December 13, 2024
ఉయ్యూరు: రూ.20 వేల జీతంతో ఉద్యోగాలు
ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని ఎన్ఏసీ శిక్షణ కేంద్రంలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారులు తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాలో బజాజ్ క్యాపిటల్, మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్, గూగుల్ పే వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. టెన్త్ ,ఇంటర్ ,డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.12,000 నుంచి 20వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు.
News December 13, 2024
నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు రాక
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. సీఎం సభ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు. 24 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.