News September 2, 2024
ల్యాండ్ పూలింగ్ పథకంలో నిబంధనల మార్పు

హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టే ల్యాండ్ పూలింగ్ పథకంలో తాజాగా నిబంధనల్లో మార్పు చేయనున్నారు. రైతులకు ఇచ్చే వాటా మౌలిక వసతుల కల్పనకే పరిమితం కానుంది. గతంలో రైతులకు సంబంధించి ప్లాట్లను కూడా హెచ్ఎండీఏ విక్రయించేది. కాగా ఈ నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతో హెచ్ఎండీఏ ధరకంటే రైతులు ఎక్కువకే విక్రయించుకునే అవకాశముంది.
Similar News
News November 26, 2025
HYD: డీజీపీ ఆఫీస్లో రాజ్యాంగ దినోత్సవం

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. అదనపు డీజీపీ మహేశ్ భగవత్, డీఎస్ చౌహన్తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికను పఠిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని పోలీసులు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేశారు.
News November 26, 2025
గాంధీ ఆస్పత్రిలో యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స

భూపాలపల్లి జిల్లా యువకుడు విజయ్కుమార్కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ & అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. విషం తాగిన తర్వాత ఏర్పడిన సబ్గ్లోట్టిక్ ట్రాకియల్ స్టెనోసిస్ సమస్య తీవ్రం కావడంతో ఈ నెల 12న సీటీవీఎస్, ENT విభాగాల వైద్యులు కలిసి క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. సీటీవీఎస్ డా.జి. రవీంద్ర, ENT డా. భూపేందర్ రాథోడ్లను సూపరింటెండెంట్ డా.వాణి అభినందించారు.
News November 26, 2025
GHMCలో విలీనం.. తర్వాత బాదుడే.. బాదుడు

GHMCలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అధికారికంగా ముగిసిన అనంతరం ఆయా ప్రాంతాలకు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పన్నులు పడే అవకాశముంది. ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ట్రేడ్ లైసెన్సులు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. విధి, విధానాలు ప్రభుత్వం ఇంకా పూర్తిగా రూపొందించలేదు. విలీన ప్రక్రియ సమగ్రంగా ముగిసిన తర్వాత పన్నుల లెక్క తేలుతుంది. దీనిపై మీ కామెంట్


