News March 22, 2025

ల్లాపూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం అత్యధికంగా కొల్లాపూర్ పట్టణంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొందలపల్లి 35 డిగ్రీలు, తోటపల్లి, వెల్దండ 34 డిగ్రీలు, అమ్రాబాద్ 32 డిగ్రీలు, అత్యల్పంగా తాడూరు మండల కేంద్రంలో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది.

Similar News

News October 28, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: ప్రతి 100 ఓట్లకు ఒకరికి బాధ్యత

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఒక్క ఓటు కూడా మిస్ కావొద్దని కాంగ్రెస్ భావిస్తోంది. 100% పోలింగ్ జరిగేలా చూసి తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేలా చూడాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరిని ఇన్‌ఛార్జిగా నియమించనుంది. ఆ ఇన్‌ఛార్జి ఆ ఓటర్లను కలిసి తప్పనిసరిగా ఓటువేసేలా జాగ్రత్తలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి మంత్రి పొన్నం ఆధ్వర్యంలో నాయకులు చర్చలు నిర్వహించారు.

News October 28, 2025

గుంటూరు: 92 కేంద్రాలకు 6 వేల మంది తరలింపు

image

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 పునరావాస కేంద్రాలకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల మంది నిర్వాసితులను తరలించారు. కేంద్రాల్లో వారికి తాగునీరు, ఆహారం, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా నేతృత్వంలో యంత్రాంగం సేవలు అందిస్తోంది.

News October 28, 2025

బస్సుల్లో ప్రయాణికుల భద్రత ముఖ్యం: మంత్రి

image

బస్సులో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్లానర్స్ అండ్ ఇంజినీర్స్ సీఈవోతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో బస్సుల భద్రత, నాణ్యతను పరిశీలించాలని మంత్రి కోరారు. బస్సుల యజమానులు భద్రత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.