News June 14, 2024
వంగర: పిడుగుపాటుకు యువకుడి మృతి

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలంలో పశువులు మేపడానికి వెళ్లి వర్షం పడడంతో చెట్ల కింద నిలబడ్డారు. అదే సమయంలో సీతారాం (33) నిలపడిన చెట్టుపై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. చెట్టుకు కూతవేటు దూరంలో ఉన్న వెంకటనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Similar News
News December 3, 2025
బూర్జలో 6 తులాల బంగారం, 23 తులాల వెండి చోరీ

శ్రీకాకుళం జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. బూర్జలోని ఓ ఇంటిలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. శనివారం సాయంత్రం స్థానికుడు రమేష్ కుటుంబంతో కలిసి అరకు వెళ్లారు. మంగళవారం ఉదయం తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు, బీరువా తెరిచి ఉన్నాయి. 6 తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.1లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 3, 2025
SKLM: ‘ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీస్ తప్పనిసరి’

వచ్చే వారానికి జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ-ఆఫీసు వ్యవస్థను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ పరంగా వివిధ శాఖల దస్త్రాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థికపరమైన దస్త్రాల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో వెనుకబడిన అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
News December 2, 2025
ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.


