News June 14, 2024

వంగర: పిడుగుపాటుకు యువకుడి మృతి

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలంలో పశువులు మేపడానికి వెళ్లి వర్షం పడడంతో చెట్ల కింద నిలబడ్డారు. అదే సమయంలో సీతారాం (33) నిలపడిన చెట్టుపై పిడుగు పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. చెట్టుకు కూతవేటు దూరంలో ఉన్న వెంకటనాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Similar News

News September 10, 2024

రణస్థలం: వరద బాధితులకు రూ.80లక్షల చెక్కు అందజేత

image

విజయవాడ వరద బాధితుల కోసం మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఏపీ విలేజ్ సర్వేయర్లు అసోసియేషన్ తరుపున రూ.80లక్షల చెక్కును అందజేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన మధు యూనియన్ నాయకులు అయ్యప్పలనాయుడు, కిరణ్‌తో కలిసి విజయవాడలో పవన్ కళ్యాణ్‌కు చెక్కును అందించారు. రాష్ట్రంలోని సర్వేయర్లు అందరూ ఒకరోజు వేతనాన్ని అందించినట్లు తెలిపారు.

News September 10, 2024

టెక్కలి: కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు

image

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపునిస్తూ మంగళవారం రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాళి ఉత్సవాల నిర్వహణకు రూ.1 కోటి రూపాయలు మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్‌లో నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపుపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

News September 10, 2024

నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.