News July 15, 2024

వంగర: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు ఓ రైతు ప్రాణం తీశాయి. ఎస్సై జనార్దనరావు వివరాల ప్రకారం.. పెద్దరాజులగుమ్మడకు చెందిన ఆర్.కృష్ణమూర్తి (46) రైతు శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో పురుగు మందు తాగాడు. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు వాహనంలో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యలో అదే రోజు రాత్రి మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Similar News

News October 14, 2024

సంతబొమ్మాళిలో వివాహిత అనుమానాస్పద మృతి

image

సంతబొమ్మాళి మండలం తెనిగిపెంట గ్రామానికి చెందిన పెంట రేవతి (19) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈనెల 4వ తేదీ నుంచి రేవతి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 6వ తేదీన గ్రామంలోని ఒక బావిలో రేవతి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే రేవతిది హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News October 14, 2024

SKLM: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న 158 మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. 158 మద్యం దుకాణాలకు 4,671 దరఖాస్తులు అందాయి. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News October 14, 2024

SKLM: DSC అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

DSC రాయనున్న SC,ST అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ DD విశ్వమోహన్ రెడ్డి తెలిపారు. అర్హత గల అభ్యర్థులు 3 నెలల పాటు శిక్షణ పొందేందుకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. http:jnanabhumi.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 22 నుంచి 25లోగా హల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ నెల 27న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు.