News June 18, 2024
వంగర: మరణంలోనూ వీడని భార్యభర్తల బంధం

భర్త చనిపోయిన కొన్ని గంటలకే భార్య మరణించిన విషాద ఘటన ఇది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరవలస గ్రామానికి చెందిన బొద్దూరు శ్రీరాములు, చిన్నతల్లి భార్యాభర్తలు. శ్రీరాములు అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. మనోవేధనకు గురైన చిన్నతల్లి భర్త మృతదేహం పక్కనే రోదిస్తూ తనువు చాలించింది. ఇలా ఒకేసారి భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 9, 2025
ఎచ్చెర్ల: ప్రారంభమైన మూడో సెమిస్టర్ పరీక్షలు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 10 కోర్సులకు సంబంధించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ ఎన్.లోకేశ్వరితో కూడిన అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
News December 9, 2025
శ్రీకాకుళం: ‘లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశాం’

శ్రీకాకుళం జిల్లాలో గడచిన 5 సంవత్సరాల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 47 మందిపై కేసులు నమోదు చేశామని జిల్లా అవినీతి నిరోధక శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ కేసులలో అధికారులు, ఉద్యోగులు ఉండగా వారిలో కొంతమంది జైలుకు వెళ్లగా మరి కొంతమంది కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నారన్నారు.
News December 9, 2025
శ్రీకాకుళం: తల్లి మందలించిదని పురుగులమందు తాగి యువతి ఆత్మహత్య

రణస్థలం మండలం ముక్తంపురానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తి (16) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. జే.ఆర్.పురం పోలీసులు వివరాలు మేరకు.. కీర్తి ఈనెల 6న ఇంట్లో TV చూస్తుండగా తన తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కీర్తి పురుగులమందు తాగింది. దీంతో ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.


