News June 12, 2024

వంగలపూడి అనితకు మంత్రి పదవి

image

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఒకరికే అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను మంత్రి పదవి వరించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కీలకపాత్ర వహించిన అనితకు మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ జాబితాలో గంటా, అయ్యన్న వంటి సీనియర్లకు చోటు లభించకపోవడం గమనార్హం.

Similar News

News December 1, 2025

పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని డిమాండ్

image

సింహాచలం దేవస్థాన పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని నిర్వసితులు డిమాండ్ చేశారు. ఆదివారం సింహాచలంలో నిర్వసితులు ధర్నా నిర్వహించారు. పంచగ్రామాల సమస్య హైకోర్టులో కేసు ఉందన్న కారణంతో ప్రభుత్వాలు ఏళ్ల తరబడి సమస్యను పరిష్కరించడంలేదన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఐటీ కంపెనీల కోసం వందల ఎకరాల దేవస్థానం భూములను కట్టబెడుతున్నారని, పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం కనీసం చర్చించడం లేదని మండిపడ్డారు.

News November 30, 2025

రాజ్యాంగ రక్షణకు సైన్యం కావాలి: పరకాల ప్రభాకర్

image

భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని దాన్ని కాపాడుకోవడానికి దళిత, బహుజన సైన్యం ఏర్పడాలని ప్రముఖ ఎకనామిస్ట్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. విశాఖలో అంబేద్కర్ భవన్‌లో ఆదివారం “భారతదేశ రాజకీయాలు- రాజ్యాంగ నైతికత సదస్సులో ఆయన మాట్లాడారు. దేశ రాజధానిలో ఊర కుక్కలపై ఉన్న స్పందన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడికి స్పందన రాకపోవటం విచారకరమన్నారు. రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమేనన్నారు.

News November 30, 2025

విశాఖ: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్’

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నవంబర్ 1న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.