News June 12, 2024
వంగలపూడి అనితకు మంత్రి పదవి

ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి చంద్రబాబు మంత్రివర్గంలోకి ఒకరికే అవకాశం దక్కింది. పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను మంత్రి పదవి వరించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ జాబితా విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. రాజకీయ ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కీలకపాత్ర వహించిన అనితకు మంత్రి పదవి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ జాబితాలో గంటా, అయ్యన్న వంటి సీనియర్లకు చోటు లభించకపోవడం గమనార్హం.
Similar News
News July 9, 2025
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
News July 9, 2025
‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.