News June 5, 2024
వంగా గీతకు తొలి ఓటమి ‘పిఠాపురమే’
వంగా గీత తొలిసారి ఓటమి చెందారు. 1983లో రాజకీయాల్లో ప్రవేశించి 1985-87 వరకు మహిళా శిశు రీజినల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1995లో కొత్తపేట ZPTCగా గెలిచారు. 1995-2000 వరకు తూ.గో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున MLAగా, 2019లో YCP నుంచి కాకినాడ MPగా గెలిచారు. ఈ ఎన్నికల్లో పవన్ చేతిలో 70,279 ఓట్ల తేడాతో ఓడారు.
Similar News
News November 7, 2024
రాజమండ్రి: ‘అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే చర్యలు’
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇసుక కార్యకలాపాలు చేయటం నిషేదమని జిల్లా కలెక్టర్ ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు నిర్వహించరాదని, అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తే శిక్షార్హులు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాన్య అవసరాలకు మించి ఇసుక అక్రమ నిల్వలు చేయరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
News November 7, 2024
తూ.గో: TODAY TOP NEWS
*ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ
*మొన్న తిట్టారు.. ఇవాళ మెచ్చుకున్నారు: మంత్రి సుభాష్
*మండపేట: కారులో నుంచి చెలరేగిన మంటలు
*రాజమండ్రి మహిళకు మంత్రి లోకేశ్ హామీ
*పాశర్లపూడిలంకలో త్రాచుపాము హల్చల్
*కాకినాడ: హత్య కేసులో ఐదుగురు అరెస్ట్
*కాట్రేనికోన: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
*కాకినాడ: 11న ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్
*జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ: కలెక్టర్
News November 6, 2024
రాజమండ్రి మహిళకు మంత్రి లోకేశ్ హామీ
రాజమండ్రికి చెందిన శిరీష అనే మహిళ జీవనోపాధి కోసం బహ్రెయిన్ దేశానికి వెళ్లి అక్కడ శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు మంత్రి లోకేశ్‌కు ఎక్స్‌లో విన్నవించుకున్నారు. శిరీషను స్వదేశానికి తీసుకురావాలని పోస్టు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్ ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.