News May 11, 2024

వంగా గీతను డిప్యూటీ CM చేస్తా: జగన్

image

పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ CM చేసి పంపిస్తానని CM జగన్ అన్నారు. పిఠాపురం సభలో ఆయన మాట్లాడుతూ.. గాజువాక, భీమవరం అయిపోయింది ఇప్పుడు పిఠాపురం వచ్చిన వ్యక్తికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందా అంటూ పవన్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు

Similar News

News February 14, 2025

రాజమండ్రి: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ 

image

తూ.గో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి సత్వర వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం రాజమండ్రిలోని జీజీహెచ్‌లో వైద్య సేవలు అందిస్తున్నా పలు విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ రోగులు పొందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, వారితో రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

News February 14, 2025

రాజమండ్రి: ఫిబ్రవరి 19న పెన్షన్ & జిపిఎఫ్ అదాలత్

image

ఫిబ్రవరి 19వ తేదీన తూ.గో జిల్లాకు పెన్షన్ కేసులు, జీపీఎఫ్ కేసులను సమీక్షించడానికి పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రపదేశ్ అకౌంటెంట్ జనరల్ విభాగం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఈ పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ట్రెజరీ అధికారి ఎన్.సత్యనారాయణ నోడల్ అధికారిగా వ్యవహారిస్తారని వెల్లడించారు.

News February 14, 2025

మంత్రి వాసంశెట్టి ప్రేమ కథ

image

అమలాపురంలోని సీతారాముల ఆయల సన్నిధిలో మంత్రి వాసంశెట్టి ప్రేమ కథకు బీజం పడింది. రాములోరి కళ్యాణం జరుగుతుండగా లక్ష్మీసునీతను చూసిన ఆయన ఆమెతో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నారు. తొలిచూపులోనే ఆమెపై మనసుపడ్డారు. ఈ విషయాన్ని ఆమెకు తెలుపగా కొన్నాళ్లకు పెద్దల ఇష్టమే తన ఇష్టమన్నారు. దీంతో ఇరు కుటుంబాలను సుభాశ్ ఒప్పించారు. 2009 APR19న ఘనంగా వివాహం జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కవలలు జన్మించారు.

error: Content is protected !!