News December 15, 2025
వంజరపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక.. ఇతనే సర్పంచ్ నా ఇక..?

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో మోర్తల చందర్ రావు ఆరో వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గిరిజనులు లేకపోవడం కారణంగా సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇదే పరిస్థితితో 1, 4, 5 వార్డుల్లోనూ ఎస్టీకి రిజర్వు కాగా నామినేషన్లు నమోదు కాలేదు. గ్రామంలో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో సర్పంచ్ ఇతనేనా..?
Similar News
News March 6, 2026
గ్రేటర్ ఎన్నికల్లో ‘కొండా’ లేనట్లేనా..?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కొండా ఫ్యామిలీ దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మేయర్ సీటును ఆశిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు తమ వారసులను ఎన్నికల బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘తాజాగా పరకాల ఎమ్మెల్యే’ సీటుపై కొండా వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.
News March 5, 2026
WGL: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక!

జిల్లాలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’కు రంగం సిద్ధమైంది. జూన్ 15 వరకు సాగే ఈ కార్యక్రమంలో తొలిదశ పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్‌లో ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, బాలల భద్రతపై ప్రత్యేక డ్రైవ్‌లు, మేలో రైతు సమస్యలు, విద్య, క్రీడలు, మహిళా సాధికారతపై దృష్టి సారించనుండగా, జూన్‌లో పర్యావరణ పరిరక్షణతో ఈ ప్రణాళిక ముగియనుంది.
News March 3, 2026
సీఎం సమీక్ష.. పాల్గొన్న వరంగల్ కలెక్టర్

ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు చేపట్టనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”పై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. గ్రామ సభల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం ఆదేశించారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై స్పష్టత ఇవ్వాలని, ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.


