News January 24, 2025

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ADB వాసికి చోటు

image

పట్టుదలతో ముందుకు సాగుతూ విజయాలు సాధించాలని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఎస్.విఠల్ 28 నిమిషాల్లో 125 సార్లు సూర్య నమస్కారం చేసి రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను సత్కరించారు.

Similar News

News January 25, 2025

వ్యాయామం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!

image

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదముంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి % తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్‌గా ఉన్నామా? లేదా? తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం బెటర్. శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడకూడదు. కడుపునిండా భోజనం చేసి ఎక్సర్‌సైజ్ చేయకూడదు.

News January 25, 2025

డాలర్‌తో రూపాయి క్షీణతపై మోదీకి కాంగ్రెస్ సెటైర్

image

డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని విమర్శించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత మోదీ పాలన వరకు రూపాయి క్షీణించడంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందో తెలుపుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఇందులో మోదీదే అత్యధిక వాటా అంటూ పేర్కొంది. పై ఫొటోలో దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. రూపాయి విలువ భారీ పతనం మోదీ పాలనలో జరిగిందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.

News January 25, 2025

నంద్యాలలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి ఫరూక్

image

తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే నంద్యాలలో రూ.8కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించి పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నంద్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.