News January 24, 2025
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ADB వాసికి చోటు

పట్టుదలతో ముందుకు సాగుతూ విజయాలు సాధించాలని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కో ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ అన్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఎస్.విఠల్ 28 నిమిషాల్లో 125 సార్లు సూర్య నమస్కారం చేసి రికార్డు సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను సత్కరించారు.
Similar News
News February 12, 2025
సంగారెడ్డి: ముగిసిన క్రీడా పోటీలు

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడా పోటీలు మంగళవారం ముగిస్తాయి. కబడ్డి, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర మాజీ డైరెక్టర్ వెంకటేశం, జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి కాసిం బేక్ విజేతలకు బహుమతులు అందించారు.
News February 12, 2025
పబ్లిక్‌లో పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదు: ఢిల్లీ కోర్టు

బార్‌లో అశ్లీల నృత్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు మహిళలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బహిరంగంగా పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదంది. వారి డాన్స్ ప్రజలకు చిరాకు కలిగిస్తేనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పొట్టి దుస్తులు ధరించి అశ్లీల డాన్స్ చేశారంటూ గత ఏడాది పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనివల్ల ఇబ్బందిపడిన సాక్షులను ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది.
News February 12, 2025
సంగారెడ్డి: ఈ నెల 17 నుంచి 10వ తరగతి పేపర్-2 పరీక్షలు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 17 నుంచి 24 వరకు ప్రాక్టీస్ పేపర్-2 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.