News March 30, 2024
వందల ఎకరాలుంది.. సంపాదించడానికి రాలేదు: క్యామ మల్లేశ్

భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. “తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు వందల ఎకరాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి రాలేదు. ప్రజా సేవ చేసేందుకు వచ్చాను. పార్లెమెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించండి” అని కోరారు. జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సునీత, కిశోర్ పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.
News November 16, 2025
నల్గొండ జిల్లాలో చలి పులి పంజా

జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. ఐదు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 – 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రెండు మూడు రోజులు జిల్లాలో శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాత్రి, పగలు శీతల గాలులు వీస్తుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో జనం బయటకు రాని పరిస్థితులు నెలకొన్నాయి.
News November 16, 2025
NLG: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పరిశీలించిన కలెక్టర్

గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బతిన్న అన్ని పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కొండమల్లేపల్లి మండలం, పెండ్లిపాకల రిజర్వాయర్ను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేసి త్వరలోనే మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.


