News November 7, 2024

వందేభారత్ Vs జన్ సాధారణ్.. మీ ఓటు దేనికి?

image

విజయవాడ-విశాఖ మధ్య ప్రారంభించిన ‘జన్ సాధారణ్'(అన్నీ జనరల్) రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుండగా.. విశాఖ మీదుగా వెళ్తున్న వందేభారత్‌‌కు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. విశాఖ, నర్సీపట్నం, దువ్వాడ, అనకాపల్లి నుంచి సామాన్యులు, చిరుద్యోగులు రాకపోకలు సాగిస్తారు. సరిపడా రైళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వందేభారత్‌కు బదులు జన్ సాధారణ్ రైళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు దేనికి ఓటేస్తారు?

Similar News

News December 6, 2024

విశాఖ: NAD కొత్త రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖ పరిధి NAD కొత్త రోడ్డులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ ఢీ కొట్టడంతో అడ్వకేట్ మృతి చెందారు. మృతుడు మర్రిపాలెం ఉడా కాలనీకి చెందిన పోతుల సూర్యనారాయణగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం KGHకి తరలించారు.

News December 6, 2024

విశాఖ: కామాంధునికి పాతికేళ్ల జైలు శిక్ష

image

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధునికి విశాఖపట్నం పోక్సో కోర్టు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది. తీర్పులో భాగంగా నిందితునికి 25 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.1,25,000 జరిమానా విధించింది. సబ్బవరం మండలానికి చెందిన ఓ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో ప్రవేశపెట్టగా శిక్ష విధించారు.

News December 6, 2024

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే గంటా భేటీ   

image

విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో సీఎంతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు భేటీ అయ్యారు. అనంతరం కాసేపు పలు విషయాలపై చర్చించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు గంటా వివరించారు.