News January 11, 2025

వందే భారత్ సీటింగ్ సామర్థ్యం పెంచిన రైల్వే అధికారులు

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 13 నుంచి నం.20708, 20707 వందే భారత్ రైళ్లు 16కోచ్‌లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్‌లను 7 నుంచి 14కి పెంచామని, తద్వారా 530గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,128కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

Similar News

News January 12, 2025

విజయవాడ: ‘అప్పట్లో అరాచకాలు, ఇప్పుడు నీతులా?’

image

వైసీపీ ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సంక్రాంతి సంబరాల పేరుతో క్యాసినోలు నిర్వహించిన ఘనత ఆ పార్టీ నేతలకే దక్కిందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు చింతల అనిల్ కుమార్ విమర్శించారు. శనివారం విజయవాడలో తన కార్యాలయంలో అనిల్ వైసీపీపై మండిపడ్డారు. ఆరు నెలల కూటమి పాలనలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఆ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించి, నేడు నీతులు వల్లించడం దారుణం అన్నారు.

News January 11, 2025

కృష్ణా: ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మందికి లబ్ధి

image

ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల కింద రూ.788 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. కాగా ఎన్టీఆర్ జిల్లాలో 605, కృష్ణాలో 508 సచివాలయాల పరిధిలో వేలాదిమందికి ఈ పథకం కింద లబ్ధి అందనుంది. గత ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలలో పీజీ చదివిన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిలిపివేయగా కూటమి ప్రభుత్వం పథకం అమలు చేస్తూ నిధులు విడుదల చేసింది.

News January 11, 2025

విజయవాడ మీదుగా అన్ రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లు

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)- విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08538 CHZ- VSKP రైలును ఈ నెల 12,16,17 తేదీలలో, నం.08537 VSKP- CHZ రైలును ఈ నెల 15, 16న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయన్నారు.