News July 16, 2024
వంద రోజుల్లో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటా: ఎస్పీ

100 రోజుల కార్యచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటానని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అంతకుముందు ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.
Similar News
News October 22, 2025
ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం వాయిదా

ఆదోని మండల ఎంపీపీ దానమ్మపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది. 28 ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం 17 మంది మద్దతు అవసరమని అధికారులు స్పష్టం చేశారు. తీర్మానానికి అవసరమైన సంఖ్య లేని కారణంగా అధికారులు అవిశ్వాసాన్ని వాయిదా వేశారు. కొన్ని రోజులుగా ఆదోనిలో ఎంపీపీ అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠ ఇక్కడితో శాంతించింది. ఎంపీపీగా దానమ్మ కొనసాగనున్నారు.
News October 22, 2025
రైలు నుంచి జారిపడిన వ్యక్తి

మంత్రాలయం రైల్వే స్టేషన్ వద్ద తమిళనాడుకు చెందిన వ్యక్తి రైలు నుంచి జారిపడి రెండు కాళ్లు పోయాయి. స్పందించిన రైల్వే పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. బతుకుదెరువు కోసం సోలాపూర్ వెళ్లి తిరిగి మధురై వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.
News October 22, 2025
Congratulations మేఘన

పెద్దకడబూరు జడ్పీ పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థిని మేఘన ‘క్వాంటం ఏజ్ బిగిన్స్-పొటెన్షియల్ అండ్ చాలెంజెస్’ అనే అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సెమినార్లో ప్రతిభ చాటారు. ఈ మేరకు ప్రశంసా పత్రం, మెడల్ మంగళవారం హెచ్ఎం ఉమా రాజేశ్వరమ్మ చేతుల మీదుగా మేఘనకు అందజేశారు. మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామని, కాబట్టి విద్యార్థులు క్వాంటం మెకానిక్స్ అనే అంశంపై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు.