News November 30, 2024
వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాలి: కలెక్టర్

వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి తొలి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.
Similar News
News January 20, 2026
రీ సర్వే పకడ్బందీగా జరగాలి: కలెక్టర్ ఆదేశం

కర్నూలు జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియ నిబంధనల ప్రకారం ఎలాంటి లోపాలు లేకుండా జరగాలని జిల్లా కలెక్టర్ డా.సిరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మ్యుటేషన్లు, అన్ క్లెయిమ్డ్ భూముల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రైతుల నుంచి వచ్చే విన్నపాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు.
News January 20, 2026
మద్దికెర, చిప్పగిరి మండలాలకు అభివృద్ధి నిధులు

నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్‌గా ఎంపికైన మద్దికెర మండలంలో రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. అంగన్వాడీలు, హెల్త్ క్లినిక్‌లు, ఆర్వో ప్లాంట్లు, మినీ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. చిప్పగిరి మండలంలో రూ.1.50 కోట్ల పనులకు అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2026
ఎమ్మిగనూరు: విషాదం.. తల్లీకూతురి మృతి

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట(M) జానంపేట సమీపంలోని NH-44పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన తల్లీకూతురు రాధ (42), లక్ష్మీదుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఆటో, బొలెరో వాహనాలు ఢీకొట్టి అనంతరం అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


