News November 21, 2024
‘వక్ఫ్ బోర్డు చట్ట సవరణలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి’
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డ్ సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎస్ఏ సుభాన్, జిల్లా అధ్యక్షుడు ముస్తఫా డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ముసల్మాన్లకు సంబంధించిన మదరసాలు, ఖబరస్థాన్లు, మసీదులు ఏవీ మిగలకుండా చేయడమే బీజేపీ సంకల్పం అని, దీని వెనక ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని అన్నారు.
Similar News
News December 10, 2024
11, 12 తేదీల్లో రాయలసీమలో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 11, 12 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పంట కోతలు పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని తెలిపింది.
News December 10, 2024
ప్రేమోన్మాదిని పోలీసులే కాల్చి చంపాలి: బాలిక తల్లి
నందికొట్కూరులో ప్రేమోన్మాది బాలికకు <<14828920>>నిప్పు<<>> పెట్టిన ఘటనపై తల్లి కన్నీరుమున్నీరయ్యారు. తనకున్న ఒక్క కూతురినీ అన్యాయంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూతురు లహరిని ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నా. అన్యాయంగా చంపేశాడు. వాడిని పోలీసులే కాల్చి చంపేయాలి. లేకుంటే నాకు అప్పగించండి.. సార్. ఇలాంటి ఉన్మాదులకు సమాజంలో బతికే హక్కులేదు’ అంటూ విలపించారు.
News December 10, 2024
బాలిక మృతి అత్యంత బాధాకరం: మంత్రి బీసీ
నందికొట్కూరులో ప్రేమోన్మాది దాడిలో బాలిక మృతి ఘటనపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాలిక మృతి అత్యంత బాధాకరమని అన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాతో ఫోన్‌లో మాట్లాడి మంత్రి బీసీ.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా పట్టిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు.