News August 10, 2024
వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం మత స్వేచ్ఛకు విరుద్ధం: సీపీఐ

మత స్వేచ్ఛకు విరుద్ధంగా కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ అన్నారు. ఆయన శనివారం ఉరవకొండ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వన్నూరుస్వామి, ప్రసాద్, మల్లేశ్, చిన్న రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 16, 2025
భర్త హత్యాయత్నం ఘటనలో భార్య మృతి

కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో అనుమానంతో ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మను కత్తితో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈనెల 12న చోటుచేసుకుంది. రత్నమ్మను కుటుంబసభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
News November 14, 2025
రైలు ట్రాక్ పక్కన వ్యక్తి మృతదేహం

పెద్దపప్పూరు మండల పరిధిలోని జూటూరు-కోమలి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ట్రాక్ పక్కన ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. స్థానికులు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
News November 13, 2025
10 మంది ఉద్యోగులకు ఎంపీడీఓలుగా పదోన్నతి!

అనంతపురం జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న 10 మందికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓ)గా పదోన్నతి లభించింది. గురువారం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ తన క్యాంపు కార్యాలయంలో వారికి నియామక పత్రాలు అందించారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు పంచాయతీరాజ్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


