News November 23, 2024

వచ్చే ఏడాది పుట్టపర్తిలో రుద్ర మహా యాగం

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతి పెద్ద రుద్ర మహా యాగం నిర్వహిస్తున్నట్లు శ్రీసత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు నిమిష్ పాండే పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం పుట్టపర్తిలో యోగం చేస్తున్నామని చెప్పారు. దేశంలోని అన్ని దేవాలయాల నుంచి ప్రముఖ పండితులు తరలి వచ్చి ఈ యాగంలో పాల్గొంటారన్నారు.

Similar News

News November 27, 2024

తాడిపత్రిలో రైలు కిందపడి తల్లీకొడుకు ఆత్మహత్య

image

తాడిపత్రి రైల్వే స్టేషన్-చల్లవారిపల్లి మధ్య తల్లీకొడుకు నారాయణమ్మ, శ్రీనివాసులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు జీఆర్‌పీ ఎస్సై నాగప్ప చెప్పారు. పెద్దపప్పూరు మండలం తబ్జూల గ్రామానికి చెందిన నారాయణమ్మ, శ్రీనివాసులు కుటుంబ కలహాల కారణంగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 27, 2024

కడప ఎస్పీకి జేసీ లేఖ.. నేడు ఏం జరగనుంది?

image

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు భూపేశ్ రెడ్డిని JC ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలింపు విషయంలో అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని తెలిపారు. ఈమేరకు కడప ఎస్పీకి లేఖ రాశారు. నేటి నుంచి తమ వాహనాలు లోడింగ్‌కు వెళ్తాయని, ఆపితే తేలిగ్గా తీసుకోమని అన్నారు. 1932నుంచి రాజకీయాల్లో ఉన్నామని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే దేనికైనా సిద్ధమేనని లేఖలో పేర్కొన్నారు.

News November 27, 2024

కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయం.. 100ఏళ్ల క్రితం ఫొటో?

image

కంబదూరు మల్లేశ్వర స్వామి ఆలయం 100ఏళ్ల నాటి చిత్రాన్ని చూశారా? ఒకప్పుడు ఈ ఆలయం గ్రామానికి దూరంగా చెట్ల మధ్య ఉండటంతో భక్తులు ఉదయం మాత్రమే దర్శించుకునే వారట. సాయంత్రం వేళ ఆలయం మూసి ఉండేదని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. సా.శ 11వ శతాబ్దంలో చోళ రాజు నిర్మించారు. ప్రస్తుతం నిత్య పూజలు అందుకుంటున్న మల్లేశ్వర స్వామి ఆలయ పూర్వ చిత్రం తాజాగా వెలుగులోకి రాగా భక్తులను ఆకట్టుకుంటోంది.