News February 3, 2025
వచ్చే నెల మార్చి 8న జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి రత్న ప్రసాద్ సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోజు 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు జరిగే లోక్ అదాలత్లో రాజీ యోగ్యమైన కేసులు పరిష్కరిస్తామన్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News November 19, 2025
రెండేళ్లుగా కూతురిని ఇంట్లోనే బంధించిన తల్లి.. ఎందుకంటే?

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన బాలిక 9వ తరగతి వరకు చదువుకుంది. రజస్వల అయిన తర్వాత “బయట ప్రపంచం ప్రమాదం” అనే భయంతో రెండేళ్ల పాటు తల్లి భాగ్యలక్ష్మి ఆమెను ఇంటికే పరిమితం చేసింది. భర్త మృతితో ఒంటరిగా మారిన తల్లి తన భయాలను కుమార్తెకు రుద్దింది. అధికారులు జోక్యం చేసుకొని తల్లీకుమార్తెలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని KGHకు, మౌనికను సంరక్షణ కేంద్రానికి తరలించారు.
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ను ఆస్పత్రికి తరలించారు.
News November 19, 2025
జేసీకి ఫిర్యాదు.. చక్కదిద్దే ప్రయత్నాల్లో అధికారులు!

ప్రకాశం జేసీకి ఫిర్యాదు చేస్తే చాలు, అలా పరిష్కారం కావాల్సిందే అంటున్నారు దివ్యాంగులు. సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి దివ్యాంగులు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అందించే త్రీ వీలర్ బైక్ పొందేందుకు, ఎల్ఎల్ఆర్ లైసెన్స్ అవసరం. దీనికై రవాణా శాఖ కార్యాలయం వద్ద కొందరు లాబీయింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జేసీ వద్ద వాపోయారు. ఆయన ఆదేశాలతో లాబీయింగ్కు చెక్ పడిందట.


