News July 27, 2024
వచ్చే నెల 1న మడకశిరకు సీఎం చంద్రబాబు రాక

ఆగస్టు ఒకటో తేదీ సీఎం చంద్రబాబు మడకశిరకు రానున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తారని సమాచారం. సీఎం రాకను పురస్కరించుకొని జిల్లాస్థాయి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Similar News
News January 9, 2026
అనంత జిల్లా ప్రజలకు అదిరిపోయే న్యూస్

సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురం జిల్లా ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూరు వంటి దూర ప్రాంతాలకైనా సాధారణ ఛార్జీలే ఉంటాయని పేర్కొంది. పండుగకు ముందు 39, తర్వాత 38 బస్సులు వివిధ ప్రాంతాలకు నడపనుంది. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
News January 8, 2026
అనంతపురం జిల్లాలో 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్

అనంతపురం జిల్లాలోని KGBVల్లో 60 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 40, టైప్-4 కేజీబీవీల్లో 20 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు..
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.
News January 7, 2026
రీసర్వే పనులు వేగవంతం చేయాలి: ఇన్ఛార్జి కలెక్టర్

అనంతపురం జిల్లాలో రీసర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రీసర్వే, ఆర్ఓఆర్, మీసేవ, భూసేకరణ అంశాలపై సమీక్షించారు. డీఎల్ఆర్ పెండింగ్ గ్రామాల్లో ప్రతిరోజు ఒక గ్రామం డేటా పంపాలని సూచించారు. రైతులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గ్రౌండ్ సర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.


