News February 1, 2025

వచ్చే నెల 10కి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్ 

image

ఏలూరు జిల్లాలో 1,045 రహదారి పనులు చేపట్టగా ఇంతవరకు 938 పనులు పూర్తయ్యాయని మిగిలిన 107 పనులను ఫిబ్రవరి 10 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి శాఖ అధికారులకు శుక్రవారం ఆదేశించారు. R&B శాఖ చేపట్టిన రహదారులకు గుంతలు పూడ్చే పనుల్లో భాగంగా 682 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారన్నారు. ఇప్పటివరకు 372 కిలోమీటర్లు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాలన్నారు.

Similar News

News February 27, 2026

2018 బ్యాచ్ గ్రూప్-1 ఆఫీసర్లకు ఎదురుదెబ్బ

image

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన <<19238436>>ఉత్తర్వులను<<>> సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగం చేయలేరా? ఎక్కడ ఉన్నా జీతం వస్తుంది. సంతృప్తిగా ఉండండి’ అని పేర్కొంది.

News February 27, 2026

ICMRలో 27 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)లో 27 సైంటిస్ట్ B పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ(బయో మెడికల్ సైన్సెస్, ఫార్మసీ) ఫార్మా డీ, ME/MTech, MCA, BE/BTech, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.56,100-రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.aiimsexams.ac.in

News February 27, 2026

మదనపల్లెలో పడిపోయిన టమాటా ధరలు

image

మదనపల్లెలో టమాటా ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం 74 వేల కిలోల టమాటాలను రైతులు తీసుకువచ్చారు. 10 కిలోల మొదటి రకం రూ. 130కి అమ్ముడు పోగా.. రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 90 కి అమ్మినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అన్ సీజన్ కారణంగా టమాటాకు రేట్లు రావడం లేదని మార్కెటింగ్ అధికారులు తెలిపారు.