News January 29, 2025
వచ్చే నెల 10వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్: కలెక్టర్

వచ్చే నెల 10 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, మార్చి 1వ తేదీ నుంచి రెగ్యులర్ పరీక్షలు జరగనున్నాయని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు.
Similar News
News January 9, 2026
అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు: డీటీసీ

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శాంత కుమారి హెచ్చరించారు. శుక్రవారం ఆమె బస్సు ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి బస్సులో హెల్ప్‌లైన్ నెంబర్ 9281607001 ప్రదర్శించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రెండో డ్రైవర్‌ను ఉంచుకోవాలని ఆమె ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తనిఖీలు చేపడతామన్నారు.
News January 9, 2026
సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతిరోజూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఎంపీడీవోలు, సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. తక్కువ హాజరు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్‌కు వెళ్లే ముందే సచివాలయంలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. హాజరు ఉన్న రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
News January 9, 2026
పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ ఆదేశాలు

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు ప్రజలు సంతృప్తి చెందేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో రోజువారీ చెత్త సేకరణ జరగాలన్నారు. డ్రైన్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో డిప్యూటీ ఎంపీడీవోలు స్వయంగా పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.


