News August 22, 2024
వచ్చే నెల 11 నుంచి ఉచిత ఇసుక పాలసీ: కలెక్టర్
వచ్చే నెల 11వ తేదీ నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇసుక బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధానంపై కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
Similar News
News September 14, 2024
గుంతకల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ముంబై-చెన్నై మధ్య ప్రధాన జంక్షన్‌గా గుంతకల్లుకు పేరుంది. దక్షిణ మధ్య రైల్వేలోని 5 ప్రధాన డివిజన్‌లలో గుంతకల్ డివిజన్ 3వది. బ్రిటిష్ ఈస్టిండియా, బ్రిటిష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలు ప్రయాణాల్లో గుంతకల్ ప్రాభవం పొందింది. అయితే పాత గుంతకల్లులో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద గుంతకల్లుకు ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నియోజకవర్గంలో కసాపురం, హజారత్ వలి మస్తాన్ దర్గా ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు.
News September 13, 2024
అనంత: నూరుల్లా దారుణ హత్యకు వివాహేతర సంబంధమే కారణం
తాడిపత్రిలో గురువారం రాత్రి నూరుల్లా(34) అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వివరాలను సీఐ సాయిప్రసాద్ వెళ్లడించారు. ‘నూరుల్లా ఆర్జాస్ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగం చేసేవారు. కొన్నేళ్ల నుంచి చిన్న బజార్‌కు చెందిన మహిళతో సన్నిహితంగా ఉన్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకొని సదరు మహిళ ఇంటి వద్దకు వెళ్లడం ఆమె బంధువులు చూశారు. ఆవేశంతో బండరాళ్లతో కొట్టి హత్య చేశారు’ అని తెలిపారు.
News September 13, 2024
శ్రీ సత్యసాయి: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం వైపు నుంచి కదిరి వైపునకు బైక్‌పై వెళ్తుండగా పక్కనున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.