News March 20, 2025

వచ్చే నెల 19న నంద్యాలకు రానున్న సీఎం

image

సీఎం చంద్రబాబు వచ్చే నెల 19న నంద్యాలకు రానున్నారు. హరిజనవాడ సమీపంలోని కంపోస్ట్ యార్డులో క్లీన్ అండ్ గ్రీన్‌తో పాటు అక్కడే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నంద్యాలకు తొలిసారి వస్తున్నారని టీడీపీ నంద్యాల పట్టణ అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News October 17, 2025

నెల్లూరు: ఎందుకీ నిర్లక్ష్యం..!

image

నెల్లూరు జిల్లాలో PM కిసాన్ నిధుల పంపిణీ ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది రైతులకు రూ.253.79 కోట్లను ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. గతేడాది వరకు 1.67 లక్షల మంది ఖాతాల్లో 3 విడతల్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే జమైంది. మరో రూ.150 కోట్లు జమవ్వాల్సి ఉంది. ఈకేవైసీ, బ్యాంక్ లింకేజీ, ఫిజికల్ రీ వెరిఫికేషన్ చేయకపోవడంతో దాదాపు 7 వేల మంది ఈ నిధులకు దూరంగా ఉన్నారు.

News October 17, 2025

జాతీయ రహదారి పనులపై కలెక్టర్ సమీక్ష

image

మంథని పట్టణంలో గురువారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష విస్తృతంగా పర్యటించారు. ఎన్‌హెచ్ 163జీ నిర్మాణంలో భూ సేకరణ మిస్సింగ్ పరిహార సమస్యలను ఈనెల 24లోపు పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. అక్టోబర్ 30లోపు మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో గ్రావెల్ పనులు పూర్తిచేయాలని సూచించారు. పర్యటనలో ఆర్‌డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఎన్‌హెచ్ పీడీ కీర్తి భరద్వాజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 17, 2025

కంచుకోటలు ఖాళీ అవుతున్నాయి!

image

బస్తర్, అబూజ్‌మడ్.. మావోయిస్టులకు కంచుకోటలు. ఎన్నో భీకర ఎన్‌కౌంటర్లకు వేదికలు. కానీ ఇప్పుడు అక్కడ తుపాకీ మూగబోతోంది. నక్సలిజాన్ని నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో వందల మంది మావోలు మరణించారు. దిక్కుతోచని స్థితిలో అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లాంటివారు కూడా లొంగిపోయారు. అబూజ్‌మడ్, నార్త్ బస్తర్ మావోరహిత ప్రాంతాలుగా మారాయని, ఇక మిగిలింది దక్షిణ బస్తరేనని అమిత్ షా ప్రకటించారు.