News August 27, 2024
వచ్చే నెల13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి నారాయణ

రాష్ట్రంలో వచ్చే నెల 13న మరో 75 అన్న క్యాంటీన్‌లను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు 202 క్యాంటీన్లు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఫుడ్ సప్లయ్ చేసేవారు అవసరమైన వాటిని సమకూర్చుకునేందుకు సమయం అడిగినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో మిగిలినవి ప్రారంభిస్తామన్నారు.
Similar News
News November 25, 2025
విశాఖ: కూచిపూడి గురువు పొట్నూరు శంకర్ కన్నుమూత

ప్రఖ్యాత కూచిపూడి రెండో తరం గురువు ‘కళారత్న’ పొట్నూరు విజయ భరణి శంకర్ (90) సోమవారం విశాఖలోని ఎండాడలో కన్నుమూశారు. వెంపటి పెద్ద సత్యం వద్ద శిక్షణ పొంది, 1982లో అకాడమీ స్థాపించి వందలాది మంది నర్తకులను ఆయన తీర్చిదిద్దారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ, నాట్యకళా ప్రపూర్ణ వంటి పురస్కారాలు అందుకున్న ఆయన 6 దశాబ్దాలుగా కళారంగానికి సేవలు అందించారు. ఆయన మృతిపట్ల కళాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు
News November 25, 2025
విశాఖ: ఐఫోన్ కొనివ్వలేదని బాలుడి సూసైడ్

ఐఫోన్ కొనివ్వలేదని తల్లిదండ్రుల మీద అలిగి బాలుడు(17) ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం.. ఆరో తరగతి వరకు చదువుకున్న బాలుడు చదువు మానేసి ఇంట్లోనే ఉండేవాడు. తల్లిదండ్రులు కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవారు. ఐఫోన్ కావాలని తండ్రితో గొడవ పడి ఇంటికి రావడం మానేశాడు. కాగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వచ్చి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
News November 25, 2025
ఫార్మా బస్సులకు గాజువాకలోకి నో ఎంట్రీ

గాజువాకలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫార్మా కంపెనీ బస్సులు అధిక సంఖ్యలో సిటీలోకి రావడంతో సమస్య అధికమైందని, వాటిని నేటి నుంచి అనుమతించబోమన్నారు. ఇప్పటికే యజమానులు, డ్రైవర్లకు సమాచారమిచ్చామన్నారు. గాజువాకకు రెండు కి.మీ దూరంలో ఉన్న శ్రీనగర్ జంక్షన్ వరకు మాత్రమే ఫార్మా బస్సులకు అనుమతి ఉంటుందని వివరించారు


