News May 19, 2024
‘వజ్రకరూరులో వాన పడింది. వజ్రాల వేట మొదలైంది’
వజ్రకరూరు మండలంలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వజ్రాల అన్వేషణ ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందని ఆశతో వెతుకుతున్నారు. ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందస్తుగా రావడంతో వజ్రాల వేట మొదలైంది.
Similar News
News December 12, 2024
అక్రమ మద్యం వ్యాపారికి మూడేళ్లు జైలు శిక్ష
గోరంట్ల మండలం ముద్దులకుంట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి 2021లో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా సీఐ జయనాయక్ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు సుదీర్ఘ విచారణ చేసి నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్లు జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బోయ శేఖర్ తెలిపారు.
News December 11, 2024
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్-2047పై సమీక్ష
స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్-2047పై శ్రీ సత్యసాయి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 13న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అవిస్కరిస్తున్న సందర్భంగా అందుకు సంబంధించిన సన్నద్ధతపై బుధవారం రాత్రి కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News December 11, 2024
‘మహాదీపం’ వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ
అరుణాచలేశ్వర దేవాలయంలో ఈనెల 13న జరిగే ‘మహాదీపం’కు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 13వ తేదీ జరిగే మహాదీపం కార్యక్రమానికి వెళ్లే భక్తులు అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిత్తూరు రహదారి గుండా వెళ్లే భక్తులకు అరుణాచలంలోని వేలూరు రహదారిలో తాత్కాలిక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.