News May 24, 2024
వజ్రపుకొత్తూరులో ఉరివేసుకొని యవకుడి ఆత్మహత్య

మండలంలోని బెండిగేట్ సమీప తోటలోని చెట్టుకు ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి భయాందోళన చెందుతూ.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని జేబులోని ఐడి కార్డు ఆధారంగా విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌లో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు(26)గా గుర్తించారు.
Similar News
News February 17, 2025
SKLM: గ్రూప్ -2 పరీక్షలకు 15 పరీక్షా కేంద్రాలు

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్‌కు ఎచ్చెర్లలో మొత్తం 15పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం తెలిపారు. మొత్తం 5,535 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ కేంద్రం వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండాలన్నారు.
News February 17, 2025
రహదారి ప్రమాదంపై అచ్చెన్న దిగ్భ్రాంతి

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుడంపాడు సమీపంలో ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
News February 17, 2025
ఇచ్ఛాపురం: శుభకార్యానికి వెళ్లొస్తూ వ్యక్తి మృతి

ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు.. ధర్మపురం గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.