News April 3, 2024
వజ్రపుకొత్తూరు: ఆలయాల్లో దొంగతనం.. ఆభరణాలు మాయం

వజ్రపుకొత్తూరు మండలం పూండి శివాలయం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయాల్లోని ఆభరణలు, పంచపాత్రలు.. విలువైన వెండి పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయాల్లోని సీసీ ఫుటేజీలను సైతం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 127 ఫిర్యాదులు అందాయాన్నారు. ప్రతి దరఖాస్తు వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు తృప్తి కలిగించే విధంగా నిర్ణీత గడువులో పరిష్కరించాలన్నారు.
News November 24, 2025
శ్రీకాకుళం జిల్లాస్థాయి సంఘ సమావేశాల నిర్వహణ

శ్రీకాకుళం జిల్లా స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ సత్యనారాయణ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రం నుంచి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న ఈ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ స్థాయి సంఘాల ప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. సమావేశాలకు అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో పాల్గొనాలని ఆదేశించారు.
News November 24, 2025
ఎచ్చెర్ల : మూడు కోర్సుల్లో జీరో అడ్మిషన్లు

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మూడు కోర్సులను ప్రారంభించారు. జియోఫిజిక్స్, జియాలజీ, ఫిలాసఫీ ఈ కోర్సుల్లో ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వీటిని మూసివేసిన ఇక్కడ ప్రారంభించడంపై నిపుణులు తప్పుపట్టారు. అధికారుల అవగాహన లేక ప్రారంభించారని విద్యావేత్తలు అంటున్నారు.


