News April 3, 2024
వజ్రపుకొత్తూరు: ఆలయాల్లో దొంగతనం.. ఆభరణాలు మాయం

వజ్రపుకొత్తూరు మండలం పూండి శివాలయం అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఆలయాల్లోని ఆభరణలు, పంచపాత్రలు.. విలువైన వెండి పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ అర్చకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయాల్లోని సీసీ ఫుటేజీలను సైతం దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 18, 2025
బారువా: ముస్తాబు అవుతున్న బీచ్ ఫెస్టివల్

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో బారువా బీచ్‌లో ఏప్రిల్ 19, 20వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లల్ని సముద్రంలోకి విడిచిపెడతారు. ఈ ఫెస్టివల్‌లో బీచ్ వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, బోట్ రైడింగ్ మొదలైన క్రీడల పోటీలు నిర్వహిస్తారు.
News April 18, 2025
నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

నరసన్నపేట వంశధార సబ్ డివిజన్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న కోర్రాయి వెంకటరమణ (57) అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా మృతి చెందారు. నరసన్నపేట మారుతి నగర్ ఒకటో వీధిలో నివాసముంటున్నారు. ఆయన భార్య ఇటీవల మృతి చెందింది. మూడ్రోజులుగా అతడు బయటకు రాలేదని, శుక్రవారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉందని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.
News April 18, 2025
శ్రీకాకుళం: కలెక్టర్‌ను కలిసిన ఉపాధ్యాయ సంఘ నాయకులు

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం ఎన్జీవో నాయకులు హనుమంతు సాయిరాం ఆధ్వర్యంలో కలిసి కుప్పిలి సంఘటనలో ఉపాధ్యాయుడుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కలెక్టర్‌ని కోరారు. హెచ్ఎం ప్రమోషన్ సీనియారిటీ లిస్టులో ఉన్న ఇద్దరి పైన కూడా ఛార్జెస్ పెండింగ్‌ను క్లియర్ చేసి ప్రమోషన్‌కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. UTF రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.