News January 30, 2025

వజ్రపుకొత్తూరు: గ్యాస్ సిలిండర్ ప్రమాదం.. ముగ్గురు మృతి 

image

వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు గ్రామానికి చెందిన లండ.రవి కుటుంబం గుజరాత్ రాష్ట్రం ముంద్రాకు వలస వెళ్లారు. మంగళవారం ఇంటిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలి లండ రవి కుమార్తె సజీవ దహనం అయింది. రవి భార్య కవిత హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. మరణ వార్తతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News September 18, 2025

శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు

image

హిందూ పురాణాల ప్రకారం నాలుగు యుగాల్లో విశ్వకర్మ ఎన్నో పట్టణాలను నిర్మించారని అదనపు ఎస్పీ కె.వి.రమణ అన్నారు. బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకులు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలు వేసి పూజలు చేశారు. ఆయుధాలతో పాటు పనిముట్లు ప్రాముఖ్యతను తెలిపిన గొప్ప వ్యక్తి విశ్వకర్మ అని ఆయన పేర్కొన్నారు.

News September 18, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ టెక్కలి, జలుమూరు, పాతపట్నం, పొందూరు, శ్రీకాకుళానికి నూతన ఎంపీడీఓలు
➤అరసవల్లి: ఘనంగా ఆదిత్యుని కళ్యాణం.
➤అధ్వానంగా ముంగెన్నపాడు రోడ్డు.
➤ శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల విశ్వకర్మ జయంతి.
➤నరసన్నపేట: ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు.
➤ఇచ్ఛాపురంలో గంజాయితో ఇద్దరు అరెస్ట్.
➤శ్రీకాకుళం: వైసీపీ ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం
➤ మా శత్రువు టీడీపీనే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

News September 17, 2025

శ్రీకాకుళం జిల్లాలో భారీగా పడిపోయిన బంతి పూల ధరలు

image

శ్రీకాకుళం జిల్లాలో బంతి పూల ధరలు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వినాయక చవితి సమయంలో కిలో రూ.50-60 పలకగా ఆ తర్వాత ధర క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీకి రూ.20 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు రూ. 35-40 వరకూ వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని అంటున్నారు. రాబోయే దసరా సీజన్ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకున్నారు.