News January 30, 2025

వజ్రపుకొత్తూరు: గ్యాస్ సిలిండర్ ప్రమాదం.. ముగ్గురు మృతి 

image

వజ్రపుకొత్తూరు మండలం వంకులూరు గ్రామానికి చెందిన లండ.రవి కుటుంబం గుజరాత్ రాష్ట్రం ముంద్రాకు వలస వెళ్లారు. మంగళవారం ఇంటిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలి లండ రవి కుమార్తె సజీవ దహనం అయింది. రవి భార్య కవిత హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. మరణ వార్తతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Similar News

News February 18, 2025

టెక్కలిలోని హాస్టళ్లలో నిఘా కరవు

image

టెక్కలిలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఓ ఇంటర్ విద్యార్థిని గర్భం దాల్చిందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలికల హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వార్డెన్లు, సిబ్బందితో పాటు విద్యార్థినుల రాకపోకలను గమనించడం లేదని , అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 18, 2025

టెక్కలి : ప్రభుత్వ హాస్టళ్లో గర్భం దాల్చిన విద్యార్థిని

image

టెక్కలిలోని ఓ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థినికి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని గర్భం దాల్చిందనే ప్రచారం సోమవారం నాటికి బయటకు పొక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News February 18, 2025

SKLM: అయోడిన్ లోపంపై అవగాహన అవసరం

image

శ్రీకాకుళం నగరంలోని DM&HO కార్యాలయంలో సోమవారం ఉదయం అయోడిన్ లోపంపై ఆశా వర్కర్లకు శిక్షణా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో DM&HO మురళి హాజరయ్యారు. జిల్లాలోని 4 మండలాల్లో 40 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్‌ను ITC ఆర్థిక సహాయంతో చేస్తున్న కార్యక్రమాలను ఆశావర్కర్లకు వివరించారు. అయోడిన్ లోపంతో వచ్చే అనర్థాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

error: Content is protected !!