News October 24, 2024

వజ్రపుకొత్తూరు: నేవీ ఉద్యోగం సాధించిన వసతిగృహం విద్యార్థిని

image

ప్రభుత్వ వసతి గృహంలో చదువుకుంటూ బచ్చల బుజ్జి ఇండియన్ నావీ ఉద్యోగం సాధించింది. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం మెళియాపుట్టి గ్రామానికి చెందిన బుజ్జి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి రాధమ్మ కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తోంది. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలోనే విద్యాభ్యాసం చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో నావీ పోటీ పరీక్షల్లో సత్తా చాటింది.

Similar News

News December 24, 2025

రణస్థలం: మనస్తాపంతో వ్యక్తి సూసైడ్

image

గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్న ఘటన రణస్థలంలోని పైడిభీమవరంలో చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు సీహెచ్ పురుషోత్తం ఆచారి (52) విరేచనాల మందు, సెంటు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కొంతకాలంగా గుండె వ్యాధితో బాధపడి, మనస్తాపానికి గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News December 24, 2025

ఈ నెల 26న మీ చేతికి మీ భూమి: మంత్రి

image

మీ చేతికి మీ భూమి 22 ఏ భూస్వేచ్ఛ పేరుతో ప్ర‌త్యేక డ్రైవ్ ను ఈ నెల 26న శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో జడ్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిషేధిత భూముల విష‌య‌మై ఎవ్వ‌రైనా విజ్ఞాప‌న‌లు చేసుకోవ‌చ్చ‌న్నారు. సంబంధిత అర్జీల‌ను రెవెన్యూ అధికారులు ప‌రిశీలించి, న్యాయం చేస్తారన్నారు.

News December 24, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు GOOD NEWS

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు-సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్‌లను నడపనున్నట్లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం-సికింద్రాబాద్-శ్రీకాకుళం నంబర్ (07288/89) గల రైలును నడపనున్నట్లు తెలిపింది.