News March 20, 2024
వట్టిచెరుకూరు: కోడ్ పాటించని ఆటోపై కేసు నమోదు

వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నరకు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.
Similar News
News October 17, 2025
పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన మంగళగిరిలోని జరగనున్న ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఆక్టోపస్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం పరిశీలించారు. ఆయన అమరవీరుల స్తూపం, వీవీఐపీ వేదికలు, గార్డ్ ఆఫ్ హానర్ ప్రాంతం, స్టేజి నిర్మాణం సహా ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లను సమీక్షించారు. పనులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 17, 2025
తెనాలి: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

తెనాలి చెంచుపేటలో మంగళవారం జరిగిన జుటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుడు గండికోట వెంకట సుబ్బారావును త్రీ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడు, నిందితుడి స్వగ్రామమైన కోడితాడిపర్రులో నెలకొన్న చిన్న వివాదాలే హత్యకు దారితీశాయని డీఎస్పీ జనార్ధనరావు, సీఐ సాంబశివరావు తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.
News October 17, 2025
మంగళగిరి: ‘మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం’

మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి సంజీవని స్వరం పేరుతో కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి చేపట్టిన పీపీపీ విధానంపై వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.