News March 20, 2024
వట్టిచెరుకూరు: కోడ్ పాటించని ఆటోపై కేసు నమోదు
వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆటోపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పదకొండున్నరకు ముట్లూరులో టీడీపీ, జనసేన పార్టీల తరఫున ప్రచారం చేస్తుండటంతో వాహనంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జిల్లాలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.
Similar News
News September 19, 2024
హామీలు కార్యరూపం దాలుస్తున్నాయి: లోకేశ్
యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా తనకు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీ నెరవేరుస్తూ ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేశామని xలో లోకేశ్ తెలిపారు.
News September 18, 2024
రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్
ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ పి. అరుణ్ బాబు హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రమశిక్షణ సంఘం సమావేశం నిర్వహించారు. కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా. ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
News September 18, 2024
రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఏపీలో మరో 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్‌ల ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.