News July 26, 2024

వట్టి నాగులపల్లి: నేడు ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్

image

అగ్నిమాపక శాఖలో కొత్తగా చేరి శిక్షణ పూర్తి చేసుకున్న 483 ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ నేడు జరగనుంది. వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఇటీవల డ్రైవర్, ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన 157 మంది అభ్యర్థులు కూడా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటారని అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.

Similar News

News October 19, 2025

HYD: సింగిల్స్‌ను టెంప్ట్ చేస్తున్నారు.. మోసపోకండి!

image

వాట్సప్‌నకు వచ్చే లింకులు, APKలతో జాగ్రత్త! సింగిల్స్‌ను టెంప్ట్ చేసేందుకు ఇటీవల కేటుగాళ్లు అశ్లీల వీడియోలు అంటూ APKఫైల్ పంపుతున్నారు. దీనిమీద క్లిక్ చేస్తే మెయిల్, గ్యాలరీ, పేమెంట్ యాప్స్ వాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయని HYD సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇటీవల నగరంలోని ఓ వ్యక్తికి వాట్సప్‌లో ఈ ఫైల్ రాగా.. తన కొడుకుకి చూపిచడంతో వెంటనే ఆ నంబర్ బ్లాక్ చేసి వాట్సప్‌నకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News October 19, 2025

HYD: యూట్యూబర్లపై సైబర్ క్రైమ్ కొరడా

image

మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ ప్రచురించినందుకు గాను రెండు యూట్యూబ్ ఛానెళ్లపై POCSO చట్టం కింద కేసు నమోదైంది. నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్వేచ్ఛ ఉంది కదా అని చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించింది.

News October 18, 2025

జూబ్లీహిల్స్ కోసం 40 ‘హస్త్రాలు’

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ 40 అస్త్రాలు ప్రయోగిస్తుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా నియమించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. AICC స్టేట్ ఇన్‌‌ఛార్జీ, CM, డిప్యూటీ CM, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులతో కూడిన 40 మందిని ప్రచారం కోసం నియమించడం విశేషం. ఒక్క MLA స్థానం కోసం కాంగ్రెస్ ఉద్దండులు అంతా బరిలోకి దిగుతుండడం సర్వత్రా ఆసక్తిగా మారింది.