News February 27, 2025

వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

image

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 27, 2025

ప.గో జిల్లాలో పోలింగ్ @12 PM

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సమయానికి 27.28% శాతంగా నమోదైందన్నారు. పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

News February 27, 2025

ఉమ్మడి ప.గో : తీరని విషాదం నింపిన శివరాత్రి

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శివరాత్రి పలుకుటుంబాలకు తీరని విషాదం మిగిల్చింది. ఏలూరులో బలివే క్షేత్రానికి వెళ్లొచ్చి చెరువులో స్నానానికి దిగి వెంకటేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సుబ్రహ్మణ్యం గల్లంతయ్యారు. ఆచూకీ తెలియలేదు. లింగపాలేనికి చెందిన అన్నదమ్ములు మణికుమార్, మునియ్య తమ్మిలేరులో మునిగి చనిపోయారు. పట్టిసీమలో నాగవీరభద్ర రావు, బలివే క్షేత్రానికి వచ్చిన అన్నవరం గుండెపోటుతో మృతి చెందారు.

News February 27, 2025

ప.గో. జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన

image

అనధికారిక ఘాట్లలో స్నానం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు, భక్తులకు ప.గో.జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. ఈసందర్భంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన ఈ క్రింది ఘాట్లలో ప్రజల భద్రత నిమితం రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. నరసాపురం టౌన్, కోడేరు, కరుగోరుమిల్లి, పెదమల్లం, సిధాంతం, దొడ్డిపట్ల ఘాట్లలో స్నానం ఆచరించాలన్నారు.

error: Content is protected !!