News March 21, 2025
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్

వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని భూపాలపల్లి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. వడదెబ్బ తగలడానికి గల ప్రధాన కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ పారితోష్ పంకజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 మంది సమస్యలు విన్నవించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఎస్పీ ఆదేశించారు.
News December 1, 2025
వనపర్తి జిల్లాలో నేటి నుంచి 30 పోలీస్ యాక్ట్ అమలు

వనపర్తి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 1-31 వరకు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగులు సభలు సమావేశాలు నిర్వహించరాదన్నారు. ఈ విషయంలో ప్రజలు రాజకీయ నాయకులు సహకరించాలన్నారు.
News December 1, 2025
IELTSకు దరఖాస్తుల ఆహ్వానం: బీసీ స్టడీ సర్కిల్

ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (IELTS) కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం, అంతర్జాతీయ స్కాలర్షిప్ పొందడం లక్ష్యంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


