News April 2, 2024

వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. నేడు ఆత్మకూర్ పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పిహెచ్సీ పరిధిలోని గ్రామ ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 6, 2025

NLG: అట్టహాసమే.. కానరాని ‘వికాసం’!

image

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట ధరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ పథకంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

News November 6, 2025

NLG: రిజిస్ట్రేషన్ చివరి తేదీ మరో 4 రోజులే

image

వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వికసిత్ భారత్ ప్రోగ్రాం చైర్మన్, నల్గొండ ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. దేశాభివృద్ధిలో విద్యార్థుల సృజనాత్మకత సందేశాత్మక వీడియో రూపొందించి అసెంబ్లీ, పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు ఈనెల 10వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

News November 6, 2025

సాగర్‌లో నేటి నుంచి బీసీ గురుకులాల క్రీడలు

image

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల మహాత్మాజ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాలలో గురువారం నుంచి బీసీ గురుకుల పాఠశాలల, కళాశాలల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే పోటీల్లో అండర్-14, 17, 19 విభాగాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు అండర్ -14 విభాగాలకు క్రీడలు నిర్వహిస్తామన్నారు.