News February 14, 2025
వడ్డేపల్లి: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

వడ్డేపల్లి మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని జులకల్ స్టేజ్లో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు.. వెంకట్ రాములు కుమారుడు భాను ప్రకాశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదాఛాయాలు అలుముకున్నాయి. కాగా, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 1, 2025
పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

నగరంలోని పార్కులను, పర్యాటక ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. నగరంలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి వస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలని సూచించారు.
News November 1, 2025
జగిత్యాల జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 1 నుంచి 30 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, నిరసనలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారం కోరారు.
News November 1, 2025
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందమూ సీఎంతో సమావేశమైంది. HYDలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని రేవంత్ కోరారు. సీఎం నివాసంలోనే ఈ భేటీ జరిగింది.


