News February 25, 2025

వడ్డేపల్లి: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

image

వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నరసింహ మంగళవారం పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. నరసింహ లోన్ తీసుకొని తిరిగి చెల్లించే క్రమంలో సంబంధిత అధికారులతో గొడవపడి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Similar News

News March 25, 2025

సీఎం సదస్సుకు హాజరైన బాపట్ల కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి పాల్గొన్నారు. అమరావతిలోని సచివాలయంలో మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

News March 25, 2025

కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: జేసీ

image

రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జేసీ నిశాంతి సూచించారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద రెవెన్యూ ఉద్యోగులతో ఆమె మంగళవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూ పరిపాలన అంశాలపై ఫైలింగ్ నిర్వహణ విధివిధానాలు పట్ల వారికి ఆమె అవగాహన కల్పించారు. భూ సంబంధిత సమస్యలపై తహశీల్దారులు, ఆర్డీవోలు విచారణ జరిపి కలెక్టరేట్‌కు నివేదిక అందించాలన్నారు.

News March 25, 2025

ముస్లిములకు BJP రంజాన్ గిఫ్ట్: 32లక్షల కిట్స్ రెడీ

image

రంజాన్ సందర్భంగా BJP మైనారిటీ మోర్చా ‘సౌగాత్ ఈ మోదీ’ క్యాంపెయిన్ ఆరంభిస్తోంది. దేశవ్యాప్తంగా 32లక్షల పేద ముస్లిములకు పండగ కిట్లను అందించనుంది. అర్హులైన వారికి ఇవి చేరేందుకు 32వేల మోర్చా కార్యకర్తలు 32వేల మసీదులతో సమన్వయం అవుతారు. BJP ప్రెసిడెంట్ JP నడ్డా రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ఆరంభిస్తారు. వీటిలో పురుషులు, స్త్రీలకు వస్త్రాలు, సేమియా, ఖర్జూర, ఎండు ఫలాలు, చక్కెర ఇతర వస్తువులు ఉంటాయి.

error: Content is protected !!