News February 25, 2025

వడ్డేపల్లి: పెళ్లింట విషాదం.. వరుడి సోదరుడు మృతి

image

వడ్డేపల్లి మండలం శాంతినగర్ సమీపంలో సోమవారం బైక్, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మురళి మృతి చెందాడు. స్థానికుల వివరాలిలా.. మండలంలోని బుడ్డమొరుసుకి చెందిన రాజన్నకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జానకి రాముడు వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి వచ్చిన బంధువులను శాంతినగర్ లో దింపేందుకు చిన్న కుమారుడు మురళి వెళుతుండగా ప్రమాదం జరిగి పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

Similar News

News March 23, 2025

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

image

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ భవన్ నందు ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షునిగా విద్యాసాగర్, సెక్రెటరీగా చంద్రమోహన్, కోశాధికారిగా సంధ్యా ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై రాజు లేని పోరాటాలు చేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.

News March 23, 2025

కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు: KTR

image

TG: ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా CM రేవంత్ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆరే మళ్లీ వస్తే బాగుండేదని రైతులు కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై అసూయ, ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే అని ఆరోపించారు.

News March 23, 2025

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చెత్త రికార్డు

image

రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు(18) డకౌటైన ప్లేయర్‌గా దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో సునీల్ నరైన్, పీయూష్ చావ్లా(16) ఉన్నారు. ఇవాళ చెన్నైతో మ్యాచ్‌లో 4 బాల్స్ ఆడిన హిట్ మ్యాన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లారు.

error: Content is protected !!