News February 24, 2025
వడ్డేపల్లి: బోర్ వెల్స్ బండి బోల్తా.. ఒకరు మృతి

గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జక్కిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో సోమవారం బోర్ వెల్స్ బండి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోర్ వెల్స్ బండిలో హెల్పర్గా పనిచేస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన కూలీ మృతి చెందాడు. గ్రామంలో ఓ రైతుకు బోరు వేసేందుకు వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. బోరు బండి బోల్తాపడటంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News November 16, 2025
దిష్టిలో ఉన్న శాస్త్రీయత ఏమిటి..?

చిన్నపిల్లలు ఆహారం సరిగా తీనకపోయినా, విరేచనాలైనా దిష్టి తగిలిందని పెద్దలు అంటుంటారు. దిష్టి తీశాక పిల్లలు చలాకీగా ఆడుకుంటారు. దీని వెనకున్న సైన్స్ ఏంటంటే.. మన కళ్లకు సౌమ్యదృష్టి, క్రూర దృష్టి అనేవి ఉంటాయి. ఈ చూపుల ప్రభావంతో శరీరం నలతకు గురవుతుంది. ఉప్పు, మిరపకాయతో దిగదీయుట, వాటిని నిప్పులో వేయుట వలన వచ్చే పొగ ముక్కు ద్వారా పీల్చుకోవడం వలన నలత దూరమై, శరీరాన్ని తేలిక చేస్తుంది. <<-se>>#Scienceinbelief<<>>
News November 16, 2025
కర్మయోగి భారత్లో ఉద్యోగాలు

కర్మయోగి భారత్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, B.COM, B.Sc, బీటెక్, BE, LLB, PG, M.Sc, ME, ఎంటెక్, MBA, PGDM, MCA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: igotkarmayogi.gov.in
News November 16, 2025
రాష్ట్రపతి నిలయంలో వేడుకలు.. ఉచితంగా పాసులు

ఈనెల 21 నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో కనువిందు చేయనున్నారు. 10 రోజుల పాటు ఈ వేడుకలు జరుగనున్నాయి. వీటిని చూడాలనుకున్న వారికి రాష్ట్రపతి నిలయం ఉచితంగా పాసులు అందజేస్తోంది. ఆసక్తిగల వారు ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
LINK: https://visit.rashtrapatibhavan.gov.in/plan-visit/rashtrapati-nilayam-hyderabad/p2/p2


